Saturday, 18 December 2021

షన్ను ఓటమిని ముందే అంగీకరించిందా?.. దీప్తి సునయన ఉద్దేశ్యం అదేనా?

ఐదో సీజన్ విన్నర్ ఎవరో అనధికారికంగా తెలిసింది. ఎక్కడ చూసినా, ఏ పోల్ చూసినా, ఏ సర్వే చేసినా కూడా సన్నీనే టాప్‌లోకి వచ్చేశాడు. అలా అందరూ కూడా సన్నీ విజయంపై ధీమాగా ఉన్నారు. సన్నీ ఫ్యాన్స్ దెబ్బకు ఈ సారి ఓటింగ్‌లో రికార్డులు బద్దలయ్యేట్టు కనిపిస్తోంది. మొత్తానికి మాత్రం తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. షో ప్రారంభంలో అయితే షన్ను విన్నర్ అని అంతా అనుకున్నారు. కానీ షన్ను చేసిన చేష్టలు, బిగ్ బాస్ ఇంట్లో చేసిన రొమాన్స్, ప్రవర్తించిన తీరుకు షన్ను ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. అయితే షన్ను మాత్రం ఇప్పుడు టాప్ 2లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం అయితే సన్నీ విన్నర్, షన్ను రన్నర్. కానీ చివరి వరకు ఫలితం ఎలా మారుతుంది.. బిగ్ బాస్ టీం ప్రకటించే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ప్రతీ ఒక్క కంటెస్టెంట్ కోసం బయట చాలానే ప్రమోషన్స్ జరిగాయి. ఒక షన్ను కోసం మొదటి నుంచి పాటు పడుతూనే ఉంది. షన్ను కోసం ప్రతీ క్షణం పోస్ట్‌లు చేస్తూ.. ప్రతీ విషయంలో వెనకేసుకుని వస్తూనే ఉంది. అయితే శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. ఓటింగ్ సమయం ముగిసిపోవడంతో సునయన ఓ పోస్ట్ వేసింది. ఇంత వరకు షన్నుకి సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వారందరికీ థ్యాంక్స్ అని చెబుతూ.. ఇక మనశ్శాంతిగా ఉందమన్నట్టుగా దీప్తి సునయన పేర్కొంది. ఇక మరో పోస్ట్ చేసి అందులో వేదాంత ధోరణిలో మాట్లాడింది. జీవితంలో జరిగే ప్రతీ ఒక్క దాని వెనక ఓ కారణం ఉంటుందని చెప్పుకొచ్చింది. అంటే షన్ను ఓటమి వెనక కూడా ఓ కారణం ఉంది అనేట్టు పరోక్షంగా చెప్పేసిందా? అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/327ABP2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...