Thursday, 23 December 2021

సమంతపై మీమ్స్.. ఎంత దుర్మార్గం!.. మొత్తానికి ఓపెన్ అయిన బ్రహ్మానందం

చేసిన స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందా? అని అంతా ఎదురుచూశారు. సమంత ఐటం సాంగ్ చేయడం ఏంటి? దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి సమంత ఫీవరో, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ ఫీవరో గానీ ఇప్పటికీ అందరూ కూడా ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామా అని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ పాట మీద ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉన్నాయి. ఊ అంటావా పాట మీద ఎన్నో రకాల వివాదాలు చెలరేగాయి. పురుష సంఘాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి. సమంత మీద కేసులు వేశాయి. మొత్తానికి మేల్ వర్షన్ అంటూ ఊ అంటావా పాపా ఊ ఊ అంటావా పాప అని మొత్తం పేరడీ చేసి పడేశారు. అయితే సమంత ఊ అంటావా పాట మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్ మీద స్పందించారు. న్యూ ఇయర్ స్పెషల్ అంటూ జీ తెలుగులో ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. బిగ్గెస్ట్ ధావత్ అంటూ ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఇందులో నాగబాబు, నిహారిక, ఆలీ, బ్రహ్మానందం వంటి వారు వచ్చారు. విశ్వక్ సేన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఈవెంట్‌లో ఆలీ జుబేదాల 25వ వివాహా వార్షికోత్సవ వేడుకలను సెలెబ్రేట్ చేశారు. అయితే బ్రహ్మానందం మీద వచ్చిన కొన్ని మీమ్స్‌ను చూపించారు. దానిపై బ్రహ్మానందం రియాక్ట్ అయ్యారు. ఊ అంటావా అనే పాటకు సమంత వేసిన స్టెప్పులు బ్రహ్మానందం నుంచి కాపీ కొట్టారంటూ ఓ మీమ్ వచ్చింది. దానిపై బ్రహ్మానందం రియాక్ట్ అయ్యారు. నేను ఎప్పుడో పాతికేళ్ల క్రితం అలా అంటే.. ఇప్పుడు సమంత కాపీ కొట్టిందని అనడం ఎంత దుర్మార్గం.. అని బ్రహ్మానందం అన్నారు. సేమ్ ఉందండి అని ప్రదీప్ అంటే.. నేను అలా లేనులే అని బ్రహ్మా కౌంటర్లు వేస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pmKxgt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...