Wednesday, 8 December 2021

చిరంజీవితో ఐటెం సాంగ్.. యాంకర్ రష్మీ అంత ఛార్జ్ చేసిందా? ఫిగర్ చూస్తే బాబోయ్ అనాల్సిందే..

ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ఓ వైపు ఆచార్య మూవీ పనులు పూర్తి చేస్తూనే తన తదుపరి సినిమాలు చక చకా కంప్లీట్ చేస్తున్నారు. అందులో ఒకటే ''. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమా ఐటెం సాంగ్ కోసం ర‌ష్మీ గౌత‌మ్‌ను తీసుకున్నట్లు తెలియడంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ సరసన జబర్దస్త్ బ్యూటీ రష్మీ చిందులేస్తే చూడాలనే కుతూహలం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవితో ఐటెం సాంగ్ చేస్తున్నందుకు గాను ర‌ష్మీ గౌత‌మ్‌ తీసుకుంటున్న రెమ్మ్యూనరేషన్ తాలూకు ఓ విషయం బయటకొచ్చింది. చిరంజీవి స్టెప్పేసే అవకాశం వచ్చినప్పటికీ రష్మీ మాత్రం బాగానే డిమాండ్ చేసిందట. ఒక్క పాట కోసమే ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్ అని, చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారని, ఈ సాంగ్ కోసం రష్మిని రిఫర్ చేసింది కూడా శేఖర్ మాస్టారే అనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ పాట 'భోళా శంకర్' సినిమాలో హైలైట్ అవుతుందని అంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జ‌త‌గా తమన్నా కనిపించనుంది. విలన్స్ బారి నుంచి త‌న చెల్లెల్ని కాపాడుకోవ‌డానికి హీరో ఏం చేశాడ‌నేదే ఈ సినిమా ప్ర‌ధాన క‌థాంశం. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dvZJB9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...