Tuesday, 9 November 2021

Vishwak Sen: ఇంతమంది అమ్మాయిలుండగా హీరోయిన్ ఎందుకు? ఓరి దేవుడా..! వీడియో వైరల్

కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనదంటూ ప్రత్యేకమైన దారి అని హింట్స్ ఇస్తున్న యంగ్ హీరో ఈ సారి '' అనే మరో డిఫరెంట్ యాంగిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ని హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేశారు. వేదికపై మాట్లాడిన విశ్వక్‌ సేన్‌.. కాలేజీ అమ్మాయిలు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికర సమాధానాలిచ్చారు. ''హీరోయిన్‌కి ఒంట్లో బాగోలేక ఈ వేడుకకు రాలేకపోయింది. మా టీమ్ అంతా బాధపడుతుంటే చెప్పా.. ఇక్కడ ఇంతమంది హీరోయిన్స్ ఉండగా, మన హీరోయిన్ ఎందుకని'' అంటూ వేదికపైకి వచ్చి రాగానే హూషారెత్తించారు విశ్వక్ సేన్. ఆ తర్వాత 'ఓరి దేవుడా' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. 'పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని 'ఓరి దేవుడా' సినిమా రూపొందిస్తున్నారు దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా ఈ మూవీ రానుంది. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.వి.పి సినిమా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తే.. పెళ్లి కష్టాలు భరించలేకనో ఏమో హీరో పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడికీ వెళ్లకుండా హీరోయిన్ ఓ తాడుతో అతన్ని కట్టేయడం కనిపిస్తోంది. అంటే పెళ్లి తర్వాత కష్టాలు భరించలేని కుర్రాడు 'ఓరి దేవుడా' అంటూ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ పారిపోవడమే ఈ మూవీ కథ అని అర్థమవుతోంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని స్పష్టమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mVHaMi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...