Sunday, 14 November 2021

Varun Tej : ఇంకా చాలా ఉంది బావ!.. సుప్రీమ్ హీరోపై వరుణ్ తేజ్

సుప్రీమ్ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్లు అవుతోంది. సరిగ్గా ఇదే రోజు ఏడేళ్ల క్రితం అంటే నవంబర్ 14న 2014లో పిల్లా నువ్వు లేని జీవితం అనే చిత్రం విడుదలైంది. మొదటి సినిమాతోనే సాయి ధరమ్ తేజ్ మంచి నటుడిగా, డ్యాన్సర్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా తేజు ఎంట్రీ అద్బుతంగా జరిగింది. అయితే మామూలుగా తేజు మొదటి సినిమా రేయ్. ఆ చిత్రం సమస్యల్లో చిక్కుకోవడంతో పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ముందు రిలీజ్ అయింది. అలా డెబ్యూ చిత్రంగా పిల్లా నువ్వులేని జీవితం అయిపోయింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఎలా ఎత్తుపల్లాలను చూసిందో అందరికీ తెలిసిందే. ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా పోరాడి గెలిచాడు. హిట్లు కొట్టేశాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. తరువాత ఒక్క హిట్ కొట్టలేకపోయాడు. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులిచ్చాడు. చివరకు చిత్రలహరి సినిమా గాడిన పడ్డాడు. ఆ తరువాత ప్రతిరోజూ పండుగే అంటూ మరో హిట్ కొట్టేశాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ అని మరో సక్సెస్‌ను రుచి చూశాడు. ఇక గత నెలలో అంటూ వచ్చాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా అంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఆ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేని స్థితిలో సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్నాడు. బైక్ ప్రమాదంతో రిపబ్లిక్ సినిమాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మొత్తానికి అంతా బాగైపోయి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు. తన ప్రయాణానికి ఏడేళ్లు అవుతుండటంతో సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఏడేళ్ల క్రితం నటుడిని కావాలన్న నా కల నెరవేరింది ఈ రోజు. మీరు నన్ను అంగీకరించారు.. ఫ్లాపులు, సక్సెస్‌ల వెంట తోడున్నారు.. ఈ అద్భుత ప్రయాణానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నాడు. దీనిపై స్పందించాడు. ఇంకా మున్ముందు చాలా ఉంది బావ.. అని కామెంట్ చేశాడు. లవ్యూ బాబు అని వరుణ్ తేజ్‌కు సుప్రీమ్ హీరో రిప్లై ఇచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Fd7tDL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...