Thursday, 18 November 2021

Shyam Singha Roy : ఇకపై కొత్త నానినే చూస్తారు!

తన సహజ నటన ఇంత వరకు లాక్కొచ్చాడు. మధ్యలో నాని కూడా కమర్షియల్, మాస్ హీరోగా మారేందుకు బాగానే ప్రయత్నించాడు. కానీ బెడిసి కొట్టేసింది. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలిసి వచ్చింది. అందుకే తన రూట్లోకి వచ్చి జెర్సీ సినిమా తీశాడు. దాంతో మళ్లీ నాని సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులు కూడా మునుపటి నానిని చూశామన్న భావనలోకి వచ్చారు. అయితే మళ్లీ ఎక్కడో ట్రాక్ తప్పాడు. ఫార్మూలా సినిమాలకు మొగ్గుచూపాడు. వీ, టక్ జగదీష్ వంటి చిత్రాలతో నాని చేతులు కాల్చుకున్నాడు. అవి ఓటీటీకి వెళ్లాయ్ కాబట్టి నిర్మాత సేఫ్ అయ్యాడు.లేదంటే విపరీతమైన లాస్ వచ్చేది. అయితే ఇప్పుడు నాని మరో కొత్త కథ, పాత్రతో ప్రయోగం చేశాడు. అంటూ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని కొత్తగా ట్రై చేశాడు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్, గ్లింప్స్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అయితే నేడు టీజర్‌ను వదిలారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నాని మాట్లాడాడు. ఇకపై వచ్చే ప్రతీ సినిమాలొ కొత్త నానిని చూస్తారు అని అన్నాడు. ప్రతీ సారి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని చూస్తాం. కానీ అన్ని సార్లు వర్కవుట్ అవ్వకపోవచ్చు. కానీ ప్రయత్నం, పెట్టే శ్రమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతీ సినిమాలో కొత్త నానినే చూస్తారు అని అన్నాడు. ప్రస్తుతం నాని అంటే సుందరానికీ, దసరా వంటి ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టేశాడు. ఇందులో దసరా తెలంగాణ నేపథ్యం రాబోతోంది. పక్కా తెలంగాణ యాస, మైనింగ్ ఏరియాలో తెరకెక్కించబోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3noYucF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...