Sunday, 14 November 2021

Samantha: రాజమౌళి డిఫరెంట్ స్కెచ్.. సమంతను అలా రంగంలోకి దించాలని ప్లాన్! ఇదే జరిగితే..

'బాహుబలి' సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సొంతం. ఈ సిరీస్ రూపొందించాక టాలీవుడ్‌లో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం RRR అనే మరో గొప్ప సినిమాను ఆవిష్కరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్టు విషయమై కోసం ఓ స్కెచ్చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. RRR రిలీజ్ త‌ర్వాత మ‌హేష్‌ బాబుతో రాజ‌మౌళి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను కూడా భారీ రేంజ్‌లో రూపొందించాలని జక్కన్న ఫిక్సయ్యారట. మహేష్ కెరీర్ లోనే మరచిపోని సినిమాగా ఉండాలని భావిస్తున్న రాజమౌళి.. ఇందుకోసం సమంతను రంగంలోకి దించుతున్నారని సమాచారం. ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా బయటపెట్టిన సమంత.. ప్రస్తుతం కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. రోల్ పరిధిని బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అయితే రీసెంట్‌గా సమంతతో రాజమౌళి సంప్రదింపులు జరిపి మహేష్ బాబుతో సినిమా గురించి చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఇప్పటిదాకా ఒక్క అనుష్కను మాత్రమే రిపీట్ చేశాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి సమంత కూడా రాబోతుందని తెలుస్తుండటం విశేషం. గతంలో రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో నటించిన సమంత.. మళ్ళీ ఇప్పుడు మహేష్ మూవీ కోసం జక్కన్న సెట్స్ పైకి రాబోతోందట. సో, చూడాలి మరి ఇది రూమరేనా? లేక నిజమవుతుందా అనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c8jFJJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...