Monday, 1 November 2021

RRR Glimpse : ఒకే ఒక్క మాటతో చెప్పేసింది.. సమంత రియాక్షన్ వైరల్

సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు విడుదల తేదీని ప్రకటించడం.. వాయిదా వేయడం వంటివి జరుగుతూనే వస్తోంది. ఇలా ఎన్నో సార్లు జరిగింది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బతో అన్ని ప్రణాళికలు తారుమారయ్యాయి. అయితే మొత్తానికి జక్కన్న తన ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉండబోతోందన్నది చిన్న వీడియో ద్వారా చూపించాడు. అందరికీ ఝలక్ ఇచ్చాడు. 40 సెకన్ల ఈ వీడియోలో తన కెపాసిటీ ఏంటో చూపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉండబోతోందనే క్లియర్‌గా చూపించాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు ఎన్నడూ చూడనంత గ్రాండ్ విజువల్స్‌తో ఆర్ఆర్ఆర్ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. కచ్చితంగా ఇది విజువల్ వండర్‌గా ఉండబోతోందని క్లియర్ కట్‌గా చూపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో కచ్చితంగా రాజమౌళి మార్క్ కనిపిస్తోంది. ప్రతీ ఒక్క షాట్, ఆ రిచ్ నెస్ అంతా కూడా దర్శకధీరుడి ఆలోచనల్లోంచే వచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. టాలీవుడ్ మొత్తం ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ చూసి షాక్ అవుతోంది. అల్లు అర్జున్ కూడా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ చూసి ఆశ్చర్యపోయినట్టు కనిపిస్తోంది. అయితే రాజమౌళి అద్భుత సృష్టిని చూసి సమంతకు మైండ్ బ్లాక్ అయినట్టుంది. వామ్మో అన్నట్టుగా ఓ ఎమోజీని షేర్ చేసింది. గుడ్ లార్డ్ అంటూ అద్భుతంగా ఉందన్నట్టుగా గ్లింప్స్‌ను ఇన స్టా స్టోరీలో షేర్ చేసింది . మొత్తానికి ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w4fuHY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...