Monday, 1 November 2021

RRR Glimps: దిమ్మ తిరిగిపోయిందన్న మహేష్ బాబు

దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే కథ మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ అన్నాడు. ఓ అడ్వంచరస్ కథ, ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ రాబోతోంది అనేదే పెద్ద వార్త. కథ, కథనాలు ఎలా ఉన్నా కూడా ఈ కాంబో మీద టాలీవుడ్ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టేసుకున్నారు. ఒక్కసారి పనులు పూర్తయితే సినిమా విడుదల అయిపోతే.. ఆ తరువాత మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథను సానబెట్టడంతో రాజమౌళి నిమగ్నం అవుతాడు. అలా రాజమౌళితో తదుపరి సినిమాను చేయబోతోన్న మహేష్ బాబు.. ఆర్ఆర్ఆర్ సినిమా మీద కూడా శ్రద్ద పెట్టేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను మహేష్ తన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. నేటి ఉదయం వదిలిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఇప్పుడు నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ కూడా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ షాట్స్, ఆ గ్రాండియర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ గ్లింప్స్‌తో ఆర్ఆర్ఆర్ మరో సారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఈ గ్లింప్స్ మీద మహేష్ బాబు స్పందించాడు. విజువల్స్ చూసి దిమ్మతిరిగిపోయింది.. అదిరిపోయిందంతే.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా? అని ఆత్రుతగా ఉంది అంటూ మహేష్ బాబు ట్వీటేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nLoo9u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...