Monday, 1 November 2021

Mani Shankar : టాలీవుడ్‌లోకి మళ్లీ ఎంట్రీ.. అప్డేట్ ఇచ్చిన సంజన గల్రానీ

టాలీవుడ్‌లో ఒకప్పుడు సంజన గల్రానీకి మంచి క్రేజ్ ఉండేది. బుజ్జిగాడు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఆ తరువాత శాండల్ వుడ్, కోలీవుడ్ అంటూ సంజనా బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌లతో మణిశంకర్ అనే చిత్రం రాబోతోంది. చిత్రాన్ని జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె) తెరకెక్కిస్తుండగా.. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. ముందు క‌త్తుల‌తో ఇంటెన్స్‌లుక్‌లో శివ కంఠ‌మ‌నేని ఉన్న ఈ క్రియేటివ్‌ ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ ఆకట్టుకునేలా ఉంది. హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ.. ఈ రోజు విడుద‌లైన మా `మ‌ణిశంక‌ర్` టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుందని అన్నాడు. ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ.. మ‌ణిశంక‌ర్ అనేది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉందని అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CNMF5j
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...