Monday, 8 November 2021

Mahesh Babu: హైదరాబాద్‌లో మహేష్ బాబు.. సర్కారు వారి పాట తాజా అప్‌డేట్.. ఇదీ డైరెక్టర్ స్కెచ్

మోస్ట్ ఎవైటెడ్ మూవీ '' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన టీమ్.. తుది షెడ్యూల్‌ షూటింగ్ హైదరాబాద్‌లో షురూ చేసింది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్, ప్యాచ్ వర్క్ అంతా చిత్రీకరించనున్నారట. దీంతో ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్లే అని తెలుస్తోంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేసేలా డైరెక్టర్ పరశురామ్ స్కెచ్చేశారట. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. చివరకు ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలైన రాజమౌళి ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్', ప్రభాస్ 'రాధే శ్యామ్' వస్తుండటంతో ఈ సినిమాను పోటీ నుంచి తప్పించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా తమ అభిమాన హీరో రెట్టింపు జోష్‌లో బరిలోకి దిగుతారని ఆసక్తి కనబర్చుతున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుబాయ్, గోవాలోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఇతర అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kiMnfs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...