Friday, 5 November 2021

Jr Ntr: నందమూరి ఫ్యాన్స్‌లో ఆందోళన.. మెగా ఫ్యాన్స్ రిలాక్స్! అసలేం జరిగింది?

వరుసపెట్టి టాలీవుడ్ అగ్ర హీరోలు గాయాల బారిన పడుతుండటం తెలుగు ప్రేక్షకుల్లో ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్‌గా చిరంజీవి చేతికి గాయం కావడంతో సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకున్న ఆయన.. తిరిగి తన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనేందుకు రెడీ కావడంతో మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. ఇంతలో నందమూరి ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా గాయపడ్డారు. కుడి చేతి భుజం నొప్పితో ఇటీవల ఆసుపత్రిలో చేరారు బాలకృష్ణ. కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అదే బాటలో ఇప్పుడు తారక్ కూడా గాయపడటంతో నందమూరి ఫ్యాన్స్‌లో ఆందోళన రెట్టింపయింది. యంగ్ టైగర్ కుడి చేతికి స్వల్ప గాయమైందనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్.. తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో చూసి ఆయన ఫ్యాన్స్ షాకయ్యారు. ఆయన కుడి చేతి దగ్గర కట్టుకట్టి కనిపించడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో అసలు ఎన్టీఆర్‌కి ఏమైంది? అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయమైందట. దీంతో నాలుగు రోజుల క్రితం డాక్టర్లు మైనర్ సర్జరీ చేశారని, వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి రుపొండుతున్న బిగ్గెస్ట్ మూవీ RRRలో నటిస్తున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qbwfQy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...