Wednesday, 10 November 2021

సమంత చెవిలో పువ్వు.. అత్యాశకు పోకుండా విజయానికి కొత్త నిర్వచనం!! ఆమె చేసిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం యమ జోష్‌లో ఉంది. విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తూ తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. మరోవైపు స్నేహితులతో కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ దేశాలు చుట్టి వస్తోంది. ఆయా ఫొటోలను సోషల్ మీడియా వాల్‌పై షేర్ చేస్తూ తన అభిమానులను కూడా ఉత్సాహ పరుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేస్తున్న మోటివేషనల్ సందేశాలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏ అయిన సామ్.. 'మై మామ్ సెడ్' అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టింది. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా షేర్ చేస్తూ ఈ కఠినమైన పరిస్థితుల నుంచి తనను తాను బయటపడేందుకు కాస్త సమయం ఇవ్వాలని నెటిజన్స్‏కు విజ్ఞప్తి చేసింది. ఇక తాజాగా సామ్ తన ఇన్‏స్టా స్టోరీలో అమెరికా రచయిత జామీ వారున్ కోట్‏ను పోస్ట్ చేసి మరోసారి డిస్కషన్ పాయింట్ లోకి వచ్చింది సమంత. ''మీరు మహా సామ్రాజ్యాలను నిర్మించవలసిన అవసరం లేదు. మీరు ఇండస్ట్రీని శాసించాలా? ఎందులోనైనా నెంబర్ వన్ అవుతారా? అదే మీరు ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది? గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గాన్ని అన్వేషించి ఆనందాన్ని పొందితే ఎలా ఉంటుంది? విజయానికి కొత్త నిర్వచనం తెలుసుకుంటే ఎలా ఉంటుంది? నీ విలువలకు తగినట్లుగా జీవితాన్ని పొందడం గురించి ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది? నీ దృష్టి కోణంలో జీవితాన్ని చూస్తూ ఆ శక్తిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? అత్యాశకు పోకుండా నీకున్న సమయంలో సంతృప్తికరమైన జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుంది? ఇక జరిగింది చాలనుకుని సర్దుకుపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవాలన్నీ ఎంతో గొప్పగా ఉంటాయి కదా'' అంటూ రీసెంట్‌గా సమంత చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగే చెవి పైభాగాన పువ్వు పెట్టుకొని ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. సమంత ఇలాంటి పోస్టులు ఎందుకు పెడుతోంది? ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి? అంటూ డిస్కషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు నెటిజన్లు. సామ్ సినీ కెరీర్ చూస్తే.. ఇటీవలే 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆమె, తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో మూడు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31P10Rd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...