Tuesday, 23 November 2021

సమంత సెగలు!.. తట్టుకోలేకపోయిన వెంకీ మామ కూతురు

ఈ మధ్య గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో సమంత మెరిసింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో యూనిట్ మొత్తాన్ని ఆహ్వానించింది. అందులో సమంత కూడా పార్టిసిపేట్ చేసింది. నేషనల్ లెవెల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నామంటే ఆ వస్త్రాధారణ కూడా ఆ స్థాయిలో ఉండాలని ఫీలైనట్టుందేమో. అలా అందాలు కనిపించేలా సమంత రెచ్చిపోయింది. హాట్ డ్రెస్సులో దర్శనమిచ్చేసింది. మొత్తానికి సమంత చేసిన ఈ అందాల ప్రదర్శన మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. మామూలుగానే సమంత పోస్ట్‌లకు వెంకటేష్ కూతురు రిప్లైలు ఇస్తుంటుంది. కామెంట్లు పెడుతుంటుంది. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే సమంత చేసిన ఈ అందాల ప్రదర్శన మీద కూడా కామెంట్ చేసింది. దీనికి సమంత కూడా రిప్లై ఇచ్చింది. కామెంట్ అంటూ స్పెషల్‌గా ఏమీ చేయలేదు గానీ ఎమోజీల రూపంలోనే తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఆ అందాల ఆరబోత ఏంటి? ఆ అందాం ఏంటి.. తట్టుకోలేకపోతోన్నా? ఉఫ్ అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది ఆశ్రిత. ఇక ఆశ్రిత చేసిన కామెంట్‌కు సమంత నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. హగ్ చేసుకుంటున్నట్టుగా చెప్పేసింది. అలా సమంత పెట్టిన మంటలు మాత్రం ఆరడం లేదు. బాలీవుడ్‌లో చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మంచి స్క్రిప్ట్ వస్తే నేను ఎక్కడైనా నటిస్తాను.. అసలు సినిమాకు భాషతో సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే ఎక్కడైనా ఆదరిస్తారు అని ఆ ఈవెంట్‌లో సమంత మాట్లాడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nRKd8R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...