Sunday, 28 November 2021

అనసూయ అడిగింది.. హైపర్ ఆది రెచ్చిపోయాడు! జబర్దస్త్ బ్యూటీతో లిప్ లాక్.. రోజా షాకింగ్ కామెంట్స్

అదేంటో.. స్కిట్ అంటేనే అదో కిక్కు. మాటల తూటాలతో రెచ్చిపోయే ఆయన ప్రతి పదంలోనూ జబర్దస్త్ పంచ్ ఉండేలా చూసుకుంటాడు. ఇక మనోడి రొమాంటిక్ యాంగిల్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. లేడీ కమెడియన్స్‌తో ఆయన వేసే స్కిట్స్, పేల్చే డైలాగ్స్ అబ్బో.. మాటల్లో వర్ణించలేం. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే జబర్దస్త్ యాంకర్ అనసూయతో హైపర్ ఆది అందరి ముందే చేసే రొమాంటిక్ మూమెంట్స్ మరో వైపు అని చెప్పుకోవచ్చు. అనిపిస్తే చాలు ఊగిపోతుంటాడు ఆది. ప్రేక్షకులకు ఇంట్లోనే కూర్చోబెట్టి వినోదం పంచడంతో పాటు కాస్త ఘాటు మసాలా కూడా దట్టిస్తూ కిక్కివ్వడం హైపర్ ఆది నైజం. ఇక ఆదికి అనసూయ తోడైతే ఆ ఊపు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. జబర్దస్త్ బ్యూటీపై పంచుల వర్షం కురిపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తుంటాడు ఆది. అందుకే చిన్నితెరపై ఆది- అనసూయ జోడీకి యమ డిమాండ్. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు అనసూయ జోలి పెద్దగా తీయని హైపర్ ఆది.. తిరిగి మళ్ళీ రెచ్చిపోయాడు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అనసూయను ఆది వాడేసిన విధానం, దానిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజా ఎపిసోడ్ కోసం పొట్టి బట్టల్లో వచ్చి భలే కిక్కిచ్చింది అనసూయ. దీనికి తోడు ఆమెపై హైపర్ ఆది కౌంటర్స్, రోజా కామెంట్స్ హైలైట్ అయ్యాయి. మాటే బంగారామాయేనా? శ్రీవల్లి అంటూ పుష్ప రాజ్ స్టైల్ కటింగ్ ఇస్తూ వేదికపైకి వచ్చాడు ఆది. రావడం రావడమే అనసూయ పక్కన నిలబడి తనపై తానే పంచ్ వేసుకుంటూ ఓపెన్ అయ్యాడు. 'ఆయన చేస్తే వెల్డన్ అనేలా ఉంది.. నేను చేస్తే వెల్డింగ్ చేసే వాడిలా ఉంది' అంటూ ఆది చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది. ఇక ఆ వెంటనే అనసూయ అందుకొని.. మా ఇంటి లాక్ పోయింది.. ఒక లాక్ ఇవ్వవా అని ఆదిని అడుగుతుంది. దీంతో మనోడి ఉత్సాహానికి రెక్కలు వచ్చి నువ్ అడగాలే గానీ.. అంటుండగానే రోజా అందుకొని షాకింగ్ కామెంట్ చేస్తుంది. 'నువ్ అడగాలే గానీ లిప్ లాక్ కూడా ఇచ్చేస్తాడు' అని కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత అనసూయ మరో డైలాగ్ వేస్తుంది. నా చెల్లెళ్లను టచ్ చేయాలంటే ముందు నన్ను చేయాలి అంటూ ఛాలెంజ్ చేస్తుంది అనసూయ. దీంతో ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ తనలోని కోరిక బయట పెట్టేస్తాడు ఆది. ఇలా రొమాంటిక్ వేషాలు వేస్తూ ఇద్దరూ బాగానే ఆకట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DcsvBn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...