Friday, 19 November 2021

ఇది పరుగుల జీవితం!.. గోవాకు చెక్కేసిన రాశీ ఖన్నా

ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో రాశీ ఖన్నా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ కవర్ చేస్తూనే.. బాలీవుడ్ సినిమాలను కూడా రాశీ ఖన్నా పట్టేస్తోంది. ఈ మధ్యే ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు గుడ్ బై చెప్పేసింది. రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అంటూ రాబోతోన్న సినిమా షూటింగ్‌ను రాశీ ఖన్నా పూర్తి చేసేసింది. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా కనిపించబోతోన్నారు. షూటింగ్ పూర్తి అవ్వడంతో చిత్రయూనిట్ అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. వీడ్కోలు పార్టీని ఘనంగా నిర్వహించింది. అలా రాశీ ఖన్నా బాలీవుడ్‌లోని ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా కాంబోలో రాజ్ అండ్ డీకేలు ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఫుల్ స్వింగులో ఉంది. అయితే ప్రస్తుతం రాశీ ఖన్నా గోవాకు చెక్కేసింది. ఏదైనా సినిమా షూటింగ్ కోసమా? లేదా వెకేషన్ కోసమా? అన్నది సరిగ్గా తెలియడం లేదు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితం.. ఒక ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఎయిర్ పోర్ట్‌కు వెళ్తున్నాను.. గోవాకు వెళ్తున్నాను అని రాశీ ఖన్నా పేర్కొంది. ఈ మధ్యే రాశీ ఖన్నా తనలోని కామెడీ యాంగిల్‌ను మరోసారి చూపించింది. గోపీచంద్ మారుతి కాంబినేషన్‌లో రాబోతోన్న పక్కా కమర్షియల్ సినిమాతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయింది. ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌లో రాశీ ఖన్నా డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xb4OYI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...