Saturday, 27 November 2021

షూటింగ్ పూర్తి కాలేదట!.. ‘విరాటపర్వం’పై సురేష్ బాబు క్లారిటీ

రానా, కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇది వరకే విరాట పర్వం నుంచి వచ్చి కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. పాటలు, టీజర్, పోస్టర్లు ఇలా ప్రతీ ఒక్కటీ అందరినీ కట్టిపడేశాయి. విరాట పర్వం సినిమా గురించి అందరూ ఎదురుచూసేలా చేసేశాయి. అయితే విరాట పర్వం ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పటికే కొన్ని వందల రూమర్లు వచ్చాయి. సినిమా విడుదలపై లెక్కలేనన్ని గాలి వార్తలు వచ్చాయి. ఓటీటీలో విడుదల కానుందని వార్తలు రావడం, వాటిని దర్శక నిర్మాతలు ఖండించడం జరుగుతూనే ఉంది. రీసెంట్‌గానే ఇలాంటి టాక్ రావడంతో కూడా కౌంటర్లు వేశాడు. ఇలాంటి వార్తలు ఎవరు రాస్తారురా అంటూ కౌంటర్లు వేశాడు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో తాజాగా స్పందించాడు. విరాట పర్వం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.. డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు.. ఇంకా ఐదు రోజుల షూటింగ్ ఉంది.. రానా, మిగతా ఆర్టిస్ట్‌ల తేదీలు కుదరడం లేదు.. అవన్నీ చూసి ప్లాన్ చేయాలి.. ఈ సినిమాకు నేను ఒక్కడినే నిర్మాతను కాదు.. వేరే వాళ్లు కూడా ఉన్నారు.. అందరం కలిసి సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటాం. మార్చి వరకు సినిమాలన్నీ కూడా వరుసలో ఉన్నాయని అన్నాడు. అంటే మార్చి తరువాతే విరాట పర్వం విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పేశాడు. వేణూ ఊడుగల దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FMQuII
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...