Wednesday, 24 November 2021

హైపర్ ఆది క్యారెక్టర్ అలాంటిది.. ఆ నిజాలు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న రైజింగ్ రాజు

ఏడెనిమిదేళ్ళుగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ వేదిక చాలామంది కమెడియన్స్‌ని వ్యక్తిగతంగా దగ్గర చేసింది కూడా. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా జబర్దస్త్ వేదికకు దూరంగా ఉంటున్న టీమ్ మెంబర్ .. తాజాగా ఈ విషయమై ఓపెన్ అయ్యాడు. సీక్రెట్ చెబుతూ అందరిముందే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. హైపర్ ఆదితో పాటు మరో టీమ్ లీడర్‌గా ఆ టీమ్ నడిపిస్తుంటాడు రైజింగ్ రాజు. అయితే ఈయన అప్పట్లో ఆర్నెళ్ల పాటు జబర్దస్త్‌లో కనిపించలేదు. ఎక్కడున్నాడు? ఎందుకు జబర్దస్త్ వీడాడు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. దీంతో అందరికీ అనుమానాలు వచ్చేశాయి. రాజు లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతోనే స్కిట్స్ చేస్తూ ఎక్కడా ఫన్ మిస్ కాకుండా నవ్విస్తూ వచ్చాడు హైపర్ ఆది. రైజింగ్ రాజు టాలెంట్ గుర్తించాకే ఆదితో పాటు రైజింగ్ రాజుకు కూడా టీమ్ లీడర్ పదవి ఇచ్చాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీమ్ అంటారు కానీ పేమెంట్స్ నుంచి అన్నీ చూసుకునేది ఆది మాత్రమే. డైలాగ్స్, స్కిట్స్ అన్నీ హైపర్ ఆది స్వయంగా రాసుకుంటాడు. అలాంటిది ఆ మధ్య కరోనా సమయంలో సీనియర్ కమెడియన్ రాజు ఉన్నట్టుండి మాయమయ్యాడు. అలా వెళ్లిన రాజు ఆర్నెళ్ళ తర్వాత తిరిగివచ్చి ఆది క్యారెక్టర్‌పై తన అభిప్రాయం చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. కరోనా సమయంలోనే తనకు మనవరాలు పుట్టిందని.. ఆ సమయంలో తాను బయటికి వెళ్తే పాపకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడి ఇంట్లోనే ఉండిపోయానని రాజు చెప్పాడు. అయితే అలాంటి సమయంలో హైపర్ ఆది ప్రతీనెల తన ఇంటికి పేమెంట్ పంపించాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా హైపర్ ఆది దేవుడని చెప్పిన రాజు.. తాను చేసినా చేయకపోయినా కూడా పేమెంట్ మాత్రం సరైన టైమ్‌కు ఇస్తుంటాడని చెప్పుకొచ్చాడు. అలా తాను కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్నపుడు హైపర్ ఆదిపై కొందరు విమర్శలు చేశారు.. అయినా నవ్వుతూ వాటిని చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడని చెప్పాడు రాజు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ka9kS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...