Friday, 19 November 2021

ధర్మ పోరాటం ఎప్పుడూ గెలుస్తుంది!.. ఈటల రాజేందర్‌పై పూనమ్ కౌర్ కామెంట్స్

ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది. ఎవరి మీద కామెంట్లు చేస్తుంది? ఎందుకు కామెంట్లు చేస్తుంది అనే విషయాలు కూడా అర్థం కావు. తాజాగా గురు నానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్, వేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హుజూరాబాద్ బై పోల్‌లో గెలుపు చారిత్రాత్మకమన్న సంగతి తెలిసిందే. అయిత ఈ ఎన్నికలుగు, గెలుపొటములు గురించి తాజాగా పూనమ్ స్పందించింది. ఈటెల రాజేందర్‌ను స్పెషల్‌గా కలిసింది పూనమ్ కౌర్. శాంతి కపోతమైన పావురాన్ని ఈటెల రాజేందర్‌తో కలిసి ఎగురవేసింది. అలా శాంతికి చిహ్నమైన తెల్లని దుస్తుల్లో కనిపించిన పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈటెల రాజేందర్‌ను ప్రత్యేకంగా కలిసిన పూనమ్ కౌర్.. గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుందంటూ ఈటెల రాజేందర్ విజయంపై స్పందించింది. రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్చ, స్వతంత్ర్యం వచ్చినట్టు అనిపించింది. శాంతికి చిహ్నమైన పావురాలను ఇలా వదిలేద్దామని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. నిబద్దత, కమిట్మెంట్, మంచివాళ్లను బాబా నానక్ ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆయనే నా నమ్మకం, ఆయన నా చుట్టూఉన్నారని, నన్ను రక్షిస్తుంటారని నా నమ్మకమంటూ తన దైవం గురించి చెప్పుకొచ్చింది.మొత్తానికి పూనమ్ ఇలా కనిపించడంతో నెటిజన్లలో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ బీజేపీలో చేరనుందా? అని కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FA0HIF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...