Tuesday, 16 November 2021

బాలయ్య అన్‌స్టాపబుల్: అల్లు అరవింద్‌తో మోహన్ బాబు తీరు.. తెర వెనుక జరిగింది ఇదే!!

రంగంలోకి దూకాలే గానీ రాజకీయాలు, సినిమాలే కాదు ఆన్ లైన్ తెరపై కూడా తన మార్క్ ఉంటుందని ప్రూవ్ చేశారు నందమూరి నటసింహం . ఇటీవలే ఓటీటీ వేదిక ఆహా రన్ చేస్తున్న '' షో హోస్ట్‌గా రచ్చ చేస్తున్నారు. ఓ సీనియర్ హీరోగా సెలెబ్రిటీల తాలూకు విషయాలను ప్రేక్షకుల ముందు పెడుతూ వావ్! అనిపిస్తున్నారు. తనదైన మాట తీరు, పంచ్‌ డైలాగ్‌లతో ఈ షోకి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విధానం పలువురి చేత భేష్ అనిపించుకుంటోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకొని తెలుగు ప్రేక్షకలోకాన్ని హుషారెత్తించింది. తొలి ఎపిసోడ్‌లో సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు సందడి చేయగా, రెండో ఎపిసోడ్‌లో బాలయ్య బాబుతో కలిసి ఆటలాడుతూ ముచ్చట్లు చెప్పారు యంగ్ హీరో నాని. ఈ రెండు ఎపిసోడ్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా తొలి ఎపిసోడ్‌ మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేసి మరోసారి ఆకట్టుకుంది ‘ఆహా’ టీమ్. షోలో పాల్గొనేందుకు రాగానే రెండు చేతులూ జోడించి నమసకరిస్తూ కనిపించారు . ఆ తర్వాత అల్లు అరవింద్‌తో చనువుగా ఉండటం, ఆ ఇద్దరి ఆలింగనం లాంటి సన్నివేశాలు తెలుగు ప్రేక్షకలోకానికి కిచ్చిచ్చాయి. ఇకపోతే పూర్ణతో కలిసి బాలకృష్ణ ఎంట్రీ సాంగ్‌కు నటరాజ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తుండటం, అలాగే విరామ సమయంలో అల్లు అరవింద్‌తో బాలకృష్ణ ముచ్చట్లు హైలైట్ సీన్స్ అయ్యాయి. తెర వెనుక ఇలా ఉంటే.. ఇక తెరపై మోహన్ బాబు- బాలకృష్ణ చేసిన సందడి ఏ రేంజ్‌లో మీ అందరికీ తెలిసిన విషయమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qPEUIy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...