Monday, 8 November 2021

రాజ్ తరుణ్ కోసం పూజా హెగ్డే.. ‘నీ వల్లే రా’ అంటూ రచ్చ

హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన రాజ్ తరుణ్.. ఇప్పుడు మాత్రం డిజస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ఓ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అన్నపూర్ణ బ్యానర్‌లో చేస్తోన్న సినిమా మీద రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ కూడా ఈ చిత్రం కోసం స్టార్లను రంగంలోకి దింపుతోంది. రామ్ చరణ్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించింది. నాగార్జున, నాగ చైతన్యలు ఎలాగూ సినిమా కోసం ముందుకు వస్తారు. అందుకే ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ వారి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. తాజాగా పూజా హెగ్డేను కూడా రంగంలోకి దించారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ నీ వల్లే రా లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. వినడంతోనే ఈ పాట ఎంతో నచ్చింది. ఎంతో బాగుంది.. అంటూ నీ వల్లే రా అనే పాటను పూజా హెగ్డే విడుదల చేసింది. గోపీ సుందర్ అందించిన ఈ బాణీకి భాస్కర భట్ల మంచి సాహిత్యాన్ని అందించగా.. రమ్య బెహర అద్భుతంగా పాడింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న మేకర్లు ప్రకటించారు. మొత్తానికి అనుభవించు రాజా సినిమా మీద మాత్రం పాజిటివ్ బజ్ ఏర్పడేలా మేకర్లు మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bP0Lr1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...