Sunday, 21 November 2021

డబ్బింగ్ పనుల్లో రష్మిక బిజీ.. ఆ విషయాన్ని నెటిజన్లకే వదిలేసిందిగా!

ప్రస్తుతం డబ్బింగ్ థియేటర్లో ఉంది. అయితే ఏ సినిమాకు డబ్బింగ్ చెబుతోందో మాత్రం సరిగ్గా తెలియడం లేదు. రెండు ఆప్షన్లు ఇచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. అసలే ఇప్పుడు రష్మిక అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. హిందీలో అయితే బ్యాక్ బు బ్యాక్ చిత్రాలున్నాయి. ఇక మళయాలంలోనే రష్మిక ఇంకా నేరుగా అడుగుపెట్టలేదు. డియర్ కామ్రేడ్ అంటూ డబ్బింగ్ చిత్రంతో కేరళలోనూ రష్మిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు రష్మిక సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్న అనసూయ దాక్షాయణి గెటప్పులో సెట్‌లో కనిపించింది. అంటే ఇంకా సినిమా షూటింగ్ చాలానే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వచ్చే వారం నుంచి సమంతతో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతోన్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు రష్మిక మాత్రం డబ్బింగ్ థియేటర్లో సందడి చేస్తోంది. అసలే డిసెంబర్‌లో పుష్ప రాబోతోంది. ఈ లెక్కన ప్రస్తుతం రష్మిక డబ్బింగ్ చెప్పేది పుష్ప సినిమాకే అని అందరూ అనుకుంటున్నారు. రెండు ఆప్షన్లు ఇవ్వగా అందులో మెజార్టీ నెటిజన్లు మాత్రం పుష్పకే ఓటు వేశారు. మరి ఈ సినిమాకే డబ్బింగ్ చెబుతుందా? లేకా మిషన్ మజ్నుకు డబ్బింగ్ చెబుతుందా? అన్నది చూడాలి. రష్మిక ఇప్పుడు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను కూడా చేస్తోంది. ఈ మధ్యే రాజమండ్రి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nKacPv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...