Friday, 5 November 2021

విక్కీతో కత్రినా కైఫ్ పెళ్లి ఖరారు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా!

బాలీవుడ్ స్టార్ క‌పుల్ విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినా కైఫ్ జోడీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. కొన్నిరోజులుగా వీరిద్ద‌రూ చెట్టా ప‌ట్టాలేసుకుని ముంబై వీధుల్లో, త‌మ బంధువుల ఇళ్ల‌కు వెళుతున్నారు. ఇన్ని రోజులు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాని క‌త్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్ జోడీ ఇంత బ‌హిరంగంగా తిర‌గ‌డానికి కార‌ణ‌మేంట‌ని అంద‌రూ భావించి ఆరాలు తీయ‌గా, త్వ‌ర‌లోనే విక్కీ, ఓ ఇంటివారు కాబోతున్నార‌ని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. విక్కీ, కత్రిన లిద్ద‌రూ ర‌హ‌స్యంగా త‌మ పెళ్లి తంతుకి సంబంధించిన ఏర్పాట్ల‌ను పూర్తి చేసుకుని త‌ర్వాత అనౌన్స్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఎవ‌రికీ వెడ్డింగ్ ఇన్విటేష‌న్ పంప‌కుండా వారే స్వ‌యంగా వెళ్లి పిలుస్తున్నార‌ట‌. రీసెంట్‌గా జ‌రిగిన దీపావ‌ళి పండుగ‌కి విక్కీ కౌశ‌ల్ త‌ల్లి వీణా కౌశ‌ల్ త‌నకు కాబోయే కోడ‌లు క‌త్రినా కైఫ్ కోసం చీర‌, న‌గ‌లు పంపింద‌ని కూడా అంటున్నారు. పెళ్లికి ముందు అత్త‌వారింటి నుంచి రావాల్సిన షాగున్‌(స్పెష‌ల్ గిఫ్ట్‌) కూడా క‌త్రినా కైఫ్‌కు అందిందంటున్నారు. డిసెంబ‌ర్ 7 లేదా 9 తేదీల్లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల్లో విక్కీ, కౌశ‌ల్ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా కేవ‌లం సెల‌బ్రిటీల‌కు మాత్ర‌మే తెలిసేలా వీరిద్ద‌రూ జాగ్ర‌త్త తీసుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. వీరిద్ద‌రూ రాజ‌స్థాన్‌లో ఓ ప్యాలెస్‌లో బంధు మిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. స్టార్ హీరోయిన్‌గా క‌త్రినా కైఫ్ బాలీవుడ్ అగ్ర హీరోలంద‌రితో న‌టించి మెప్పించింది. త‌న‌కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను ఏర్ప‌రుచుకుంది. విక్కీ కౌశ‌ల్ హీరోగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. రణ‌భీర్ క‌పూర్‌తో బ్రేక‌ప్ త‌ర్వాత కత్రినా కైఫ్ విక్కీ కౌశ‌ల్‌కు ద‌గ్గ‌రైంది. వీరిద్ద‌రూ బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. కానీ త‌మ బంధంపై ఎప్పుడు, ఎక్క‌డా వీరు నోరు విప్ప‌లేదు. ఈ రిలేష‌న్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ల క్ర‌మంలో వీరు ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నార‌ట‌. క‌త్రినా కైఫ్‌ను బాలీవుడ్‌లో బాగా ఎంక‌రేజ్ చేసిన హీరో స‌ల్మాన్ ఖాన్‌. ఆయ‌న‌తో కూడా క‌త్రినా కైఫ్ ప్రేమాయ‌ణం నెరిపింది. ఒకట‌వుతారు అని అనుకుంటున్న స‌మ‌యంలో ఎందుక‌నో తెలియ‌దు స‌ల్మాన్‌కు క‌త్రినా దూర‌మైంది. కానీ ఇద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టించారు. త‌ర్వాత ర‌ణ‌భీర్ క‌పూర్‌తోనూ క‌త్రినా ఘాటు ప్రేమ‌క‌థ‌ను న‌డిపించింది. ఇంకేముంది త్వ‌ర‌లోనే పెళ్లి ఉంటుంద‌ని అంద‌ర‌రూ అనుకుంటున్న త‌రుణంలో అత‌నితో కూడా కత్రినాకు బ్రేక‌ప్ అయ్యింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి జీవించేలా ఆమె అడుగులేస్తుంద‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o9clTQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...