Wednesday, 3 November 2021

చిరంజీవితో తమన్నా రొమాన్స్! కెరీర్ లోనే బెస్ట్ ప్యాకేజ్.. మిల్కీ బ్యూటీకి లక్కీ ఛాన్స్

స్టార్ హీరోలందరి సరసన నటించి భారీ క్రేజ్ కూడగట్టుకున్న మిల్కీ బ్యూటీ .. ఇప్పుడు సీనియర్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన F3 మూవీ చేస్తున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. మెగాస్టార్ హీరోగా రూపొందుతున్న '' సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయబోతోంది తమన్నా. ఈ నేపథ్యంలో తమ్ము రెమ్మ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నాను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, ఈ చిత్రంలో నటించినందుకు గాను ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ‘భోళా శంకర్‌’ కోసం ఆమె దాదాపు 3 కోట్లు తీసుకుంటోందట. ఇప్పటికే ఇందులో సగం అడ్వాన్స్‌గా ఆమె ఖాతాలోకి వెళ్లిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇది ఆమె కెరీర్ లోనే బెస్ట్ ప్యాకేజ్ అవుతుంది. చిరు సరసన కథానాయికగా నటించాలని ఎప్పటి నుంచో ఆశగా చూస్తున్న తమన్నా.. గతంలో సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవితో తెర పంచుకుంది. ఇక ఇప్పుడు ‘భోళా శంకర్’తో చిరు సరసన రొమాన్స్ చేసే అవకాశం చేజిక్కించుకుంది. అంటే ఇది తమన్నాకు లక్కీ ఛాన్స్ కావడమే గాక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇటీవలే విడుదల చేసిన ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా సినిమాను లాంఛ్ చేసి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. పక్కా ప్రణాళికతో తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందిచారట మెహర్ రమేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bCqoey
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...