Wednesday, 24 November 2021

భార్య అంజనాపై నాని కామెంట్స్ వైరల్.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నాచురల్ స్టార్ పోస్ట్

దాదాపు ఐదేళ్లు యలవర్తిని ప్రేమించి పెళ్లాడిన నాచురల్ స్టార్ .. రీసెంట్‌గా తన భార్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్న ఈ జోడీ టాలీవుడ్ స్వీట్ కపుల్స్‌లో ఒకరిగా ఉన్నారు. అన్ని విషయాల్లో ఒకరికి ఒకరుగా ఉంటూ ముందుకెళ్తున్నారు. కెరీర్ పరంగా నానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది అంజనా. ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌తో పాటు అండర్‌స్టాండింగ్ ఉండటంతో వైవాహిక జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ నేపథ్యంలో అంజనా పుట్టిన రోజు సందర్భంగా నాని తన భార్యకు కాస్త వెరైటీగా విష్ చేస్తూ ఆమెతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో షేర్ చేశారు. ''మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా.. సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ ..హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యు'' అంటూ తన భార్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నాని. దీంతో నాచురల్ స్టార్ పోస్ట్ వైరల్ అయింది. ఆయన ఫ్యాన్స్ కూడా అంజనాకు పెద్ద ఎత్తున విషెస్ పోస్ట్ చేస్తున్నారు. sa ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న `శ్యామ్ సింగరాయ్` రిలీజ్‌కి రెడీ అవుతోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. దేవదాసి వ్యవస్థ, మతపరమైన ఆచారాల చుట్టూ తిరిగే పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nOqMxm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...