Friday, 19 November 2021

వైజాగ్ వేదికగా బాలయ్య బాబు గర్జన.. స్కెచ్చేసిన బోయపాటి! ముందస్తు పనులు షురూ..

అడుగెడితే.. షో మొదలెడితే.. ఎలా ఉంటుందో సగటు ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. మరి ఆయన స్పీడుకు బోయపాటి తోడైతే..! ఇక ఆ సంచలనాలు ఊహించగలమా. గతంలో ''సింహ. లెజెండ్'' అంటూ బాలయ్యబాబు అభిమానులను హుషారెత్తించిన మాస్ డైరెక్టర్ ఇప్పుడు 'అఖండ' సినిమాతో బరిలోకి దిగుతున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన బోయపాటి.. వైజాగ్ వేదికగా పక్కా స్కెచ్చేశారని తెలుస్తోంది. ఆంధ్రా నందమూరి ఫ్యాన్స్ ఊగిపోయేలా విశాఖ తీరాన బాలయ్య బాబు గర్జన ప్లాన్ చేశారట బోయపాటి శ్రీను. ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్‌ని వేదికగా ఎంచుకున్నారట. భారీ ఏర్పాట్ల నడుమ ఈ నెల 28వ తేదీన ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ముందస్తు పనులు మొదలుపెట్టారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. భారీ బడ్జెట్ కేటాయించి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ 'అఖండ' మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్ పోషించారు. మోతుబరి రైతుగా, అఘోరగా ఆయన లుక్స్ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయని సమాచారం. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ బాణీలు కట్టారు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30JdZDy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...