సీనియర్ కొరియోగ్రఫర్ కరోనాతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య, పెద్ద కొడుకు కూడా బారిన పడ్డారు. దీంతో కుటుంబం మొత్తాన్ని చిన్న కొడుకు అజయ్ కృష్ణ చూసుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పరిస్థితి విషమించడం, ఆయన ఊపిరి తిత్తులు దాదాపు 75 శాతం దెబ్బ తినడంతో వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడ్డాయి. దీంతో సాయం కోసం అజయ్ కృష్ణ ఎదురుచూశారు. సోనూ సూద్, ధనుష్ వంటివారు అజయ్ కృష్ణను సంప్రదించినట్టు తెలుస్తోంది. తాజాగా మా అధ్యక్షుడు స్పందించారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం గురించి ఆరా తీశానని అన్నాడు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాను.. ఇప్పుడు మనం అంతా కూడా ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ప్రార్థిద్దామని మంచు విష్ణు తెలిపాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cRoqYk
v
No comments:
Post a Comment