Tuesday, 9 November 2021

లగెత్తి కొడితే లడ్డుండ.. ముద్దుగుమ్మలతో నాగార్జున రొమాంటిక్ మూమెంట్స్! నాగ చైతన్య కామెంట్స్ వైరల్

టాలీవుడ్ మన్మథుడు, సీనియర్ హీరో మరోసారి తన లోని రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టారు. కెమెరా ముందు హీరోయిన్లతో నాగార్జున ఆడే సరసాలకు యమ డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. గతంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ భారీ హిట్ పట్టేసిన ఆయన ఇప్పుడు అదే బాటలో ''గా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని ''లడ్డుండ'' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి నాగార్జున రొమాంటిక్ యాంగిల్స్ బయటపెట్టారు మేకర్స్. 'బంగార్రాజు'గా సోగ్గాడు మళ్ళీ వచ్చాడు అనే ట్యాగ్ లైన్‌తో మనందరి ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఆయన హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తోంది. గత కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుంచి 'లడ్డుండ' అనే రొమాంటిక్ సాంగ్ వదిలారు. ధనుంజయ్‌, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్‌ మోహన్‌ ఆలపించిన ఈ పాటకు ‘అబ్బాయ్‌ హార్మోనీ.. డంటకు డడనా’ అంటూ నాగార్జున గొంతు కలపడం విశేషం. తనదైన యాసలో హుషారుగా నాగార్జున పాడిన తీరు హైలైట్ అవుతోంది. ఇక ఈ పాటలో బంగార్రాజు స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ కూడా తన సరసాలను వదిలిపెట్టనట్టు చూపించిన సన్నివేశాలు రసిక ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ''నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు'' అని పేర్కొన్నారు. ఇది నిజం అంటూ నాగ చైతన్య చేసిన ఈ ట్వీట్‌పై అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. దీంతో ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే ఈ బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తుండటం మరో విశేషం. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి రొమాన్స్ చేస్తోంది. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3018PSW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...