Sunday, 7 November 2021

ప్రియుడితో కత్రినా జోడీ.. ఆ డైరెక్టర్ ఇంట్లో కానిచ్చిన హీరోయిన్! వేడుకగా 'రోకా' ఫంక్షన్

బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ప్రేమ వ్యవహారాలు కామన్‌గా చూస్తుంటాం. కొద్దిరోజుల పాటు చెట్టాపట్టాలేసుకు తిరిగి ఆ తర్వాత ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చితే ఏకమవడం, లేకపోతే ఆ బంధానికి బ్రేకప్ చెబుతుండటం తరచుగా జరిగే పరిణామాలే. ఈ క్రమంలోనే గతంలో పలుసార్లు లవ్ ఎఫైర్స్ విషయంలో వార్తల్లో నిలిచిన హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇప్పుడు తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో మూడు ముళ్ల బంధానికి రెడీ అయిందట. సీక్రెట్‌గా ఈ ఇద్దరి 'రోకా' ఫంక్షన్ కూడా ఫినిష్ అయిందని తెలుస్తోంది. దీపావళి పండగతో పాటు అదే రోజు కత్రినా కైఫ్‌- జీవితాల్లో మరో వేడుక జరిగిందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పెళ్లి ముందు జరిపే రోకా వేడుకను అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫినిష్ చేశారట. కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ ఖాన్‌ నివాసంలో ఈ వేడుక జరిగిందని సమాచారం. కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన తల్లిదండ్రులతో పాటు సోదరుడు సన్నీ కౌశల్‌ ఈ వేడుక హాజరయ్యారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌‌ని చాలా స్పెషల్‌గా జరుపుకుంటారు. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. వధూవరుల తల్లిదండ్రులు ఒకచోట కూర్చొని నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి ముహూర్తం, వేదిక, విందు వంటి విషయాలు ఈ వేడుకలో చర్చించుకుంటారు. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌ తినిపించుకొని ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా దీపావళి రోజు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్ రోకా వేడుక ఘనంగా జరిపించారట. డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారని, ఈ వేడుకకు పెద్దఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BV2CVN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...