Thursday, 25 November 2021

కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ మ్యారేజ్.. పెళ్లికి వచ్చే వారికి లవ్ బర్డ్స్ వింత రిక్వెస్ట్!!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్‌- మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలు నిజం కాబోతున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ వివాహ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ముఖ్య స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. అయితే తమ పెళ్లి వేడుకకు వచ్చే వారికి కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ జోడీ ఓ రిక్వెస్ట్ పెట్టిందని తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత ఈ పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని కత్రినా, విక్కీ కోరినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజర్స్‌కి సైతం ఫోన్లు తీసుకురావద్దని ఆర్డర్ చేశారట. కేవలం తాము నియమించుకున్న ఫోటోగ్రాఫర్స్ మాత్రమే తమ పెళ్లి వీడియోలు, ఫోటోలు తీయాలని.. వాటిని పెళ్లి తర్వాత అందరిముందుకు తెచ్చి సర్‌ప్రైజ్ చేయాలని కత్రినా జోడీ భావిస్తోందట. తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత వహించిన ఈ లవ్ బర్డ్స్ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నరాట. ప్రస్తుతం వీరి పెళ్లి పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్‌, అతిథుల కోసం ఇచ్చే విందు ఇటు కత్రినా అటు విక్కీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం. కాగా ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Zh16P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...