Saturday, 6 November 2021

జయమ్మ పంచాయితీ.. చాలా స్ట్రాంగ్‌గా బరిలోకి దిగిన యాంకర్ సుమ! ఇదీ మ్యాటర్

గత కొన్నేళ్లుగా బుల్లితెరపై రాణిస్తున్న ఇప్పుడు వెండితెరపై కన్నేసింది. తన మాటల తూటాలతో సినిమాల ఫంక్షన్స్ హోస్ట్ చేయడమే కాదు నేరుగా సినిమాల్లో కూడా నటించి సత్తా చాటాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఓ బలమైన క్యారెక్టర్‌తో కెమెరా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రీసెంట్‌గా సుమ కన్ఫర్మ్ చేయడంతో అందరి దృష్టి ఆ సినిమా ఏమై ఉంటుంది? సుమ రోల్ ఎలా ఉంటుందనే దానిపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ క్యూరియాసిటీకి తెర దించుతూ స్ట్రాంగ్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది యాంకర్ సుమ. సుమ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ విడుదల చేసి ఆసక్తి పెంచేశారు. విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు '' అనే బలమైన టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు వదిలిన మోషన్ పోస్టర్‌లో సుమ క్యారెక్టర్ ఇంతా స్ట్రాంగ్‌గా ఉండనుందనే దానిపై క్లియర్ హింట్ ఇచ్చారు. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని సారీ ధరించిన సుమ.. పల్లెటూరి పెద్దగా నటిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌లో పోలీస్ స్టేషన్, ఉరి వేయబడిన మనుషులు, పల్లెటూరి పంచాయితీ లాంటి విభిన్న అంశాలను చూపిస్తూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. దీంతో సుమ చేస్తున్న ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా ఈ 'జయమ్మ పంచాయితీ' రూపొందుతోంది. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కడుతున్నారు. గతంలో 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్‌గా చేసిన సుమ.. మళ్ళీ ఇన్నేళ్లకు ఇంత స్ట్రాంగ్ రోల్‌తో రీ- ఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పింది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుపనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ETHlho
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...