Monday, 1 November 2021

మెగా కాంపౌండ్‌లోకి బాలయ్య బాబు!! ఆనాడే సైన్ చేసిన నటసింహం.. ఇదే జరిగితే..

నందమూరి నటసింహం మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. తొలిసారి మెగా వర్గంతో సినిమా చేయనున్నారని తెలుస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్‌తో బాలయ్య చర్చలు నడుస్తున్నాయనేది లేటెస్ట్ సమాచారం. ఇప్పటికే హ్యాండిల్ చేస్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై అన్‌స్టాబబుల్‌ విత్‌ ప్రోగ్రాం చేస్తున్న బాలయ్య బాబు.. ఈ డీల్ కుదిరిన సమయంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం. మెగా ఫ్యామిలీకి ఓన్ బ్యానర్ లాంటి గీతా ఆర్ట్స్‌తో బాలయ్య సినిమా అనేసరికి అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందనే టాక్ ముదిరింది. ఇదే జరిగితే ఓ మెగా బ్యానర్‌పై బాలయ్యను తొలిసారి చూసేయొచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో అఖండ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా వీరిద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనించనున్నారట. తమన్ బాణీలు కడుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nGcT38
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...