Monday, 22 November 2021

Bangarraju : ‘బంగార్రాజు’గా అదరగొట్టిన చైతూ

కింగ్ సోగ్గాడే చిన్ని నాయన అంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పంచెకట్టుతో నాగ్ చేసిన సరసాలు, వేసిన చిలిపి వేషాలకు బాక్సాఫీస్ బద్దలైంది. బంగార్రాజుగా నాగ్ చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే తాజాగా యవ్వనంలో ఎలా ఉండేవాడో అనేట్టుగా నాగ చైతన్యను చూపించినట్టు కనిపిస్తోంది. బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బంగార్రాజు కర్రను నేలకు కొట్టే విధానం, నడిచి విధానం అందరికీ తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయకు ప్రీక్వెల్‌గా ఈ బంగార్రాజు రాబోతోన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వేసిన వేషాలను ఇందులో చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా నాగ చైతన్య లుక్ చూస్తుంటే మంచి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. మొత్తానికి మంగళవారం చైతూ బర్త్ డే సందర్భంగా థ్యాంక్యూ మూవీ అప్డేట్ కూడా రాబోతోంది. అలానే ఈ బంగార్రాజు టీజర్ కూడా రాబోతోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో చై ఫుల్ ఫాంలో ఉన్నాడు.. మరి రేపు సమంత తన విషెస్ అందిస్తుందో లేదో చూడాలి. మొత్తానికి సమంత ఓ వైపు తన పనులతో బిజీగా మారింది. ఇటు చైతూ కూడా అన సినిమాలతో బిజీగా ఉన్నాడు. బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30SrnFN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...