Tuesday, 23 November 2021

Akhanda : బాలయ్య మాస్ జాతర.. ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కాంబినేషన్‌ అంటే మాస్ ఆడియెన్స్‌కు జాతరలా ఉంటుంది. అదిరిపోయే డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్సులతో బాలయ్యను అభిమానులకు మెచ్చేట్టు చూపిస్తాడు బోయపాటి. సింహా, లెజెండ్ తరువాత మూడో సారి అంటూ రాబోతోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సాంగ్, పోస్టర్లు ఇలా అన్నింటితో అఖండ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా అఖండ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నవంబర్ 27న శిల్పా కళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతోన్నారు. అయితే ఈ విషయంలో కొన్ని రూమర్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రాబోతోన్నాడంటూ రూమర్లు వచ్చాయి. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎలాంటి హింట్లు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ వచ్చే సూచనలు లేవనిపిస్తోంది. ఇక గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులు మాత్రం ఈవెంట్‌కు వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే తదుపరి చిత్రాలు తెరకెక్కించే దర్శకులు వాళ్లే. ఈ చిత్రం కోసం తమన్ అద్భుతమైన పాటలు అందించినట్టు కనిపిస్తోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోన్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cI3Zgo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...