Saturday, 13 November 2021

AKHANDA Trailer : ల్యాండ్ మైన్!.. హైప్ పెంచిన తమన్

బోయపాటి కాంబినేషన్ అంటే ఎవ్వరికైనా ఆ సినిమా ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఇద్దరు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. సింహా, లెజెండ్ వంటి వాటితో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశాడు. ఇక ఇప్పుడు మూడో సారి బోయపాటి శ్రీను బాలయ్య కలిసి అఖండగా రాబోతోన్నారు. ఇప్పటికే సినిమా అంచనాలు ఆకాశన్నంటాయి. ఇక రేపు ట్రైలర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ట్రైలర్ రిలీజ్ అంటూ ఇచ్చిన అప్డేట్.. దాంతో పాటు వదిలిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతంది. బాలయ్య అఘోరగా విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో బాలకృష్ణ అఘోరగా తన విశ్వరూపాన్ని చూపించేశారు. చేతిలో త్రిశూలం, వెనకాల కాళీ మాత విగ్రహం అవన్నీ చూస్తుంటే ట్రైలర్ పీక్స్‌లో ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది. రేపు సాయంత్రం 7:09 గంటలకు ట్రైలర్ రానుంది. అయితే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. మొదటి సారి బాలయ్యతో కలిసి తమన్ పని చేస్తుండటంతో మ్యూజిక్ అదిరిపోయేట్టుంది. ఇప్పటికే వదిలిన పాటలు దుమ్ములేేపుతున్నాయి. భం అఖండ అనే పాటకు, దాని బీజీఎంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక రేపు రాబోయే ట్రైలర్‌లో తమన్ ఎలా చెలరేగిపోతాడో చూడాలి. మొత్తానికి ఈ చిత్రం ఒక ల్యాండ్ మైన్ అని చెప్పేశాడు. దాంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రేపు సాయంత్రం బాలయ్య గర్జన మొదలు కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kzKXx8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...