Wednesday, 3 November 2021

రవితేజ 71: టైగర్ నాగేశ్వరరావు.. మాస్ మహారాజ్ నెవర్ బిఫోర్ స్ట్రాటజీ!!

వరుస హిట్స్ పట్టేస్తూనే ఒకానొక సమయంలో గాడితప్పిన మాస్ మహారాజ్ రవితేజ తిరిగి 'క్రాక్' సినిమాతో ట్రాక్ ఎక్కారు. అప్పటినుంచి వరుస సినిమాలకు కమిటవుతూ తన అభిమానులకు కిక్కిస్తున్నారు. కోవిడ్ సమయంలో వరుసగా డిఫరెంట్ కథలు విన్న మాస్ మహారాజ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన 71వ సినిమా టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. '' పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ భారీ బడ్జెట్‌ కేటాయించి రూపొందించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే ఒక గ‌జ‌దొంగ క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారట‌. మాస్ మహారాజ్ సినిమాల్లో నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమా ఉండనుందని టాక్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్న రవితేజ మరికొద్ది రోజుల్లో 'ఖిలాడీ'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే 'ధమాకా' అనే మరో మూవీ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఆయన 70 సినిమాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది మాస్ మహారాజ్ తాకిడితో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k1pOf1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...