Wednesday, 27 October 2021

UnStoppable Promo : బాలయ్య బ్రాండ్ వైరల్.. మొత్తంగా అదే హైలెట్

నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటిసారిగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేశాడు. బాలయ్య టాక్ షో అనగానే అందరిలోనూ ఎన్నో రకాల అనుమానాలు, ఆశ్చర్యార్థకాలు కలుగుతుంటాయి. అయితే తాజాగా బాలయ్య షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో బాలయ్య తన స్టైల్లో దుమ్ములేపేశాడు. సినిమాల్లో మాదిరిగా డైలాగ్‌లతో రెచ్చిపోయాడు.కారు ఎక్కాడు, బైక్ మీద రైడ్ చేశాడు.. గుర్రపు స్వారీ కూడా చేసేశాడు. తనతో మామూలుగా ఉండదని చెప్పకనే చెప్పేశాడు. సై అంటే సై నై అంటే నై అని బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. వన్స్ ఐ స్టెప్ ఇన్.. థింకింగ్ మారిపోవాలా అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌లతో ప్రోమోపై మంచి అంచనాలు ఏర్పడాయి. అయితే ఆహాలో రాబోతోన్న ఈ షోను మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్ ప్రసెంట్ చేస్తోందట. ప్రోమో చివర్లో ఇది కనిపించడంతో అందరూ దానిపైనే కామెంట్ చేస్తున్నారు. బాలయ్యకు మ్యాన్షన్ హౌస్‌కు ఉన్న బంధం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. అలా అదే మ్యాన్షన్ హౌస్ తన షోకు ప్రజెంటర్‌గా ఉండటంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ప్రోమో మొత్తంలో ఎన్నో స్పెషాల్టీస్ ఉన్నా కూడా అందరి చూపు ఆ మ్యాన్షన్ హౌస్ మీదే పడింది. మొదటి గెస్టుగా మోహన్ బాబు రాబోతోన్నాడని, రెండో అతిథిగా వెంకటేష్, రానా రాబోతోన్నారనే టాక్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ నవంబర్ 4న రాబోతోందట. బాలయ్య బోయపాటి కాంబోలో రాబోతోన్న అఖండ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GpIEWP
v

No comments:

Post a Comment