Monday, 25 October 2021

శ్రీరెడ్డి చీర విప్పినందుకే MAA రిజిష్టర్ అయ్యింది.. ‘మా’ పరువు తీసిన వర్మ.. లైవ్‌లోనే ఇలా!

MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌)కి ప్రత్యేకమైన భవనం ఎందుకో తనకి అర్థం కావడం లేదని అన్నారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అసలు ‘మా’ అనేదానికి అంత సీన్ ఉందా? ఇంత సీన్ క్రియేట్ అయ్యిందంటే మీడియా వల్లేనని అన్నారు వర్మ. మనిషి సైకాలజీ ప్రకారం ఎదురుగా కెమెరా పెడితే ప్రతి ఒక్కరూ నటులు అయిపోతుంటారు.. మా ఎన్నికల్లోనూ అదే జరిగింది అంటూ సైటైర్లు వేశారు వర్మ. ఈ సందర్భంలో వివాదాల దర్శకుడు వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇష్యూని ప్రస్తావనలోకి తీసుకుని వచ్చారు. ‘మా ఎన్నికల టైంలో నాకు చాలా సీన్లు కనిపించాయి. బెనర్జీని నేను ఎప్పుడూ ఏడ్వడం చూడలేదు.. సినిమాలో కూడా ఏడ్వడం చూడలేదు. బెనర్జీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ‘మా’ ఎన్నికల ద్వారానే తెలిసింది. రేపటి రోజున ఏదైనా ఏడ్చే క్యారెక్టర్ ఉంటే.. బెనర్జీతో చేయించవచ్చని నాకు మంచి ఆలోచన కలిగింది. బెనర్జీ అంటే ప్రొఫెషనల్ యాక్టర్.. అలాంటి వారు ఏడ్చేయడం.. భుజాలు కొరికేసుకుని రచ్చ చేయడం.. తలుపులేసి మరీ నన్ను కొట్టారు తిట్టారు అంటే 2020 అమెరికన్ ఎలక్షన్స్‌లో కూడా ఇంత రభస జరగలేదు. ఇవన్నీ చూస్తే కామెడీతో పాటు.. ఇబ్బందికరంగా కూడా అనిపించింది. ‘మా’లో ఇంత ఉందా? అని తెలిసింది. నాకు అసలు మా ఉందని తెలిసిందే శ్రీరెడ్డి వల్ల. ఆమె బట్టలిప్పి నిరసన తెలిపినప్పుడు ‘మా’ ఉందని రిజిష్టర్ చేశా. శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకు వెళ్లి చీర విప్పిందని అని చెప్పినప్పుడు ‘మా’ అనేది ఒకటి ఉందని తెలిసింది. అప్పటి వరకూ నాకు ‘మా’ తెలియదు. ‘మా’ ఎన్నికలను ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారో ఓ మిస్టరీలా ఉంది’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZjuJAk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...