Friday, 22 October 2021

GHANI First Single : వరుణ్ తేజ్ రచ్చ షురూ

మెగా ప్రిన్స్ ప్రస్తుతం డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. కమర్షియల్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూనే డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎఫ్ 3కి ఓకే చెప్పాడు. అదే సమయంలో అనే సినిమాకు కూడా తలూపాడు. ఇక గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. కరోనా సమయంలోనూ బాక్సింగ్, జిమ్ అంటూ ఫుల్ బిజీగా గడిపాడు. అయితే గని సినిమా మీద అంచనాలు పెంచేందుకు మేకర్స్ మంచి ప్లాన్స్ వేశారు. అందులో భాగంగానే గని ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయాయి. వరుణ్ ఇచ్చిన పంచ్‌కు పగిలిపోయింది. అలా మొత్తానికి వరుణ్ తేజ్ ఈసారి కూడా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఆ ఫస్ట్ గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, బాక్సింగ్ రింగ్ సెటప్‌కు తగ్గట్టుగా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు . ఇక ఈ సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. అక్టోబర్ 26వ తేదీన గని నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ మీద మొదటి చిత్రంగా అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. సిదు ముద్ద, అల్లు బాబీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C8jxVI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...