Sunday, 3 October 2021

డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్.. రంగంలోకి సల్మాన్ ఖాన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణించి చెప్పింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులోనే ఇదే విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఏ రేంజులో ఉందో ఎన్నో ఉదాహరణలు బయటకు వచ్చాయి. తాజాగా తనయుడు అరెస్ట్‌తో మరోసారి కలకలం సృష్టిస్తోంది. మొత్తానికి ఆర్యాన్ ఖాన్ మీద NDPS (నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) చట్టంలోని 8c, 20B, 27, 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జువైనల్ కస్టడీలోకి తీసుకున్నారు. డగ్ర్ పార్టీ జరుగుతుండగా.. ఎన్‌సీబీ దాడులు నిర్వహించింది. అక్కడ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యాన్ ఖాన్ పట్టుబడ్డాడు. అతనితో పాటు అర్బాజ్ ఖాన్, మున్మున్ దామేచ వారు కూడా ఉన్నారు. వారందరినీ అరెస్ట్ చేసి జువైనల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం కిల్లా కోర్ట్‌లో హాజరు పరిచారు. ఇది బెయిల్ ఇచ్చే నేరాలే అయినా కూడా సోమవారం వరకు మాత్రం రిమాండ్‌లోనే ఉంచాలని ఎన్‌సీబీ కోరింది. కానీ కోర్టు మాత్రం ఒక్కరోజు కస్టడీనే విధించింది. అయితే ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్యాన్ ఖాన్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి బయల్దేరి షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లాడు. అయితే షారుఖ్‌కు కాస్త భరోసాను ఇచ్చేందుకు సల్మాన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక మరో వైపు షారుఖ్ తరుపు న్యాయవాది మాత్రం ఆర్యాన్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఆ పార్టీలో పాల్గొన్నట్టు ఆదారాలు కూడా లేవని, కేవలం చాట్ మెసెజ్ ద్వారానే పోలీసులు అరెస్ట్ చేశారని అంటున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A6cxam
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...