ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే ఇష్యూ నడుస్తోంది. అదే మ్యాటర్. తమ విడాకులపై వస్తున్న రూమర్లను నిజం చేస్తూ అక్టోబర్ 2న అధికారికంగా డివోర్స్ కన్ఫర్మ్ చేశారు చై- సామ్. ఇకపై తామిద్దరం స్నేహితులుగా మాత్రమే ఉంటామని ప్రకటించారు. దీంతో ఎంతో చూడముచ్చటగా ఉంటూ ఒకరంటే ఒకరు అమితంగా ఇష్టపడే ఈ జోడీ ఎందుకు బ్రేకప్ చెప్పుకుంది అనే దానిపై జోరుగా చర్చలు ఊపందుకున్నాయి. మరోవైపు సామ్, చైతూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల నడుమ చై- సామ్ నాలుగో యానివర్సరీ డే రానే వచ్చింది. నేడు (అక్టోబర్ 7) సమంత- మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రోజు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా తమ పెళ్లి రోజున సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ పోస్టులు పెట్టేవారు ఆ ఇద్దరూ. అయితే ఈ ఏడాది వీళ్ళ యానివర్సరీ డే వచ్చేసరికి బ్రేకప్ జరిగిపోయింది. దీంతో ఈ విషయాన్ని తట్టుకోలేని ఇరువురి ఫ్యాన్స్ గతేడాది పెళ్లి రోజున షేర్ చేసిన పోస్ట్ తిరిగి వైరల్ చేస్తున్నారు. గతేడాది పెళ్లి రోజున తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ''నేను నీ దాన్ని.. నువ్వు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్'' అని క్యాప్షన్ పెట్టింది . ఇదే పోస్ట్ మళ్ళీ పంచుకుంటూ.. ఇంత ప్రేమ ఏడాది లోపే ఆవిరి కావడంతో తమ గుండె ముక్కలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AjBS0o
v
No comments:
Post a Comment