Wednesday, 6 October 2021

విడాకుల తర్వాత సమంత నివాసం ఎక్కడంటే..? బయటకొచ్చిన అసలు మ్యాటర్.. సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ

గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ అవుతున్న చై- సామ్ విడాకుల ఇష్యూకి ఎట్టకేలకు తెరపడింది. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి అక్టోబర్ 2వ తేదీన స్వస్తి చెప్పారు నాగ చైతన్య, దంపతులు. సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ఎవరికివారు పోస్టులు పెట్టారు. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని, స్నేహితులుగా మాత్రం కొనసాగుతామని ప్రకటించారు. దీంతో ఈ ఇష్యూపై సినీ వర్గాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ కండీషన్స్ వల్లే సమంత ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటుంటే.. లేదు లేదు డబ్బు కోసమే సామ్ ఇలా చేసిందని ఇంకొందరు ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంది. ఇది పక్కన బెడితే విడాకుల అనంతరం సమంత ఎక్కడ ఉండనుంది? ఆమె నివాసం హైదరాబాద్ నుండి ముంబై షిఫ్ట్ కానుందా? అనే విషయమై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. నిజానికి విడాకుల మ్యాటర్ అధికారికంగా ప్రకటించక ముందే సమంత.. ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిందనే టాక్ నడిచింది. దీంతో విడాకుల అనంతరం సామ్ అక్కడికే వెళ్లనుందని, ఇకపై ముంబైలోనే స్థిరపడనుందని చాలా మంది భావించారు. కానీ ఊహించని విధంగా సమంత.. హైదరాబాద్ లోనే ఉండటానికి ఇష్టపడుతోందని ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎప్పటికీ హైదరాబాదే తన హోమ్ టౌన్ అంటోందట సామ్. ఈ మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్‌ కూడా సెలెక్ట్ చేసుకుందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో అలరించిన సమంత.. ఇటీవలే 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు 'కాతు వక్కుల రెందు కాదల్‌' అనే తమిళ సినిమా చేస్తోంది సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uJilp9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...