Sunday, 24 October 2021

నా ముఖంపై మొటిమలు.. ఆ భయం వెంటాడేది.. పర్సనల్ విషయాలపై సాయి పల్లవి కామెంట్స్

వెండితెరపై చూపే అభినయం, ఆమె హుషారు ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాచురల్ అందాలతో ఏ మాత్రం ఎక్స్‌పోజింగ్ చేయకుండా ప్రేక్షకులను కట్టిపడేయడం సాయి పల్లవి స్టైల్. అలా తన నటనతో 'ఫిదా' చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ సంగతులపై ఓపెన్ అయింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు వెంటాడేవని చెప్పింది సాయి పల్లవి. కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చానని, అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో తనకూ కొన్ని భయాలుండేవని చెబుతూ ఓపెన్ అయింది. అప్పటిదాకా తాను చూసిన హీరోయిన్లంతా ముఖంపై ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లేనని, కాబట్టి తన ముఖంపై ఉన్న మొటిమల గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకుంటారో అనే భావన ఉండేదని చెప్పింది. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదల తర్వాత తన ఆలోచనలన్నీ తప్పని అర్థమైందని చెప్పుకొచ్చింది. పైకి కనిపించే అందం కంటే క్యారెక్టర్ ముఖ్యమని, అందరూ అదే చూస్తారని అప్పుడు తెలిసిందని చెప్పింది. ఇటీవలే నాగ చైతన్య సరసన ‘లవ్‌స్టోరీ’ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్స్ రీ- ఓపెన్ అయ్యాక ఘన విజయం సాధించింది. మరికొద్ది రోజుల్లో ‘’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సాయి పల్లవి. ఈ సినిమాలో రానా, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఇందులో సాయి పల్లవి రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nqSNto
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...