Wednesday, 27 October 2021

సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. గత నెలలో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీద నుంచి అదుపుతప్పి క్రింద పడ్డ సాయి తేజ్.. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఇటీవలే ఆయన్ను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రత్యేక అప్డేట్ వచ్చింది. గాయాల బారి నుంచి సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండీషన్‌లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతో పాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండీషన్ లోకి వస్తోందని అంటున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియజేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. దీంతో అప్పటినుంచి ఆయన ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇకపోతే రీసెంట్‌గా దేవాకట్టా దర్శకత్వంలో హీరోగా రూపొందిన 'రిపబ్లిక్' సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరికొద్ది రోజుల్లో తన కెరీర్‌లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నారట సాయి ధరమ్ తేజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bcZpGr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...