Thursday, 7 October 2021

పబ్లిక్‌గా ఇంద్రజ చేయి పట్టుకున్న హైపర్ ఆది.. కరెంట్ పాస్! ఇవేం బుద్దులురా మీకు..

జబర్దస్త్ కమెడియన్‌గా ఫుల్ పాపులర్ అయిన .. ఇప్పుడు ''లోనూ హంగామా చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్‌తో కలిసి తనదైన నైజంతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మాట మాటకు పంచ్ డైలాగ్ వేస్తూ కిక్కిచ్చే ఈ కమెడియన్‌లో రొమాంటిక్ యాంగిల్ కూడా తక్కువేమీ కాదండోయ్. వీలు చిక్కినప్పుడల్లా అటు అనసూయతో రెచ్చిపోయే రొమాన్స్ చేస్తూనే ఇటు గ్లామర్ బ్యూటీ దీపికతో కెమెరా ముందు తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. అవకాశం దొరికిన ప్రతిసారి అందమైన అమ్మాయితో రొమాంటిక్ డ్యూయెట్స్ వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు హైపర్ ఆది. ఈ నేపథ్యంలోనే తాజాగా వదిలిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో వీడియోలో ఆది మార్క్ కనిపించింది. ఏకంగా సీనియర్ హీరోయిన్ చేయి పట్టుకున్నాడు హైపర్ ఆది. ఈ సీన్ ప్రోమోలో హైలైట్ అవుతోంది. అక్టోబరు 10న దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్. నటుడు నాగినీడు (మర్యాద రామన్న ఫేమ్) ముఖ్య అతిథిగా విచ్చేసి వేదికపై అలరించాడు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో వదలగా అందులో.. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లోని పాటలు, డాన్సులతో కంటెస్టెంట్లు హంగామా చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే 'మగధీర' సినిమాలోని సీన్ రీ- క్రియేట్ చేసి ఇంద్రజ సహా అందరికీ షాకిచ్చాడు హైపర్ ఆది. ఇంద్రజను మిత్రబింద అనుకో అని సుధీర్ చెప్పగానే.. ఇంద్రజ దగ్గరకు వెళ్లి ఆవిడ చేయి తాకాడు హైపర్ ఆది. ఇంకేముంది వెంటనే కరెంట్ పాస్ అయింది. దీంతో 'అరేయ్ ఆది.. ఓ సార్ చేయిని టచ్ చేయరా' అని సుధీర్ అనడంతో నాగినీడు చేయి తాకాడు హైపర్ ఆది. మళ్ళీ కరెంట్ పాస్ అయింది. దీంతో నాగినీడు ఇచ్చిన రియాక్షన్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ''అరేయ్.. బైరెడ్డి, మల్లసూరీ ఇవేం బుద్దులురా మీకు..'' అనేశాడు నాగినీడు. మొత్తంగా చూస్తే ఈ ప్రోమో వీడియో పొట్టచెక్కలయ్యే నవ్వులు పంచుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ysb0hn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...