Wednesday, 20 October 2021

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నో చెప్పిన మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్..అఖిల్ ‘ఏజెంట్‌’కు ఓకే అన్నాడా?

అక్కినేని నేటి త‌రం న‌ట వార‌సుల్లో ఒక‌రైన .. ఎట్ట‌కేల‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఇది త‌న‌కే కాదు, అక్కినేని అభిమానుల‌కు సైతం ఆనందాన్నిచ్చే విష‌య‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు అదే ఉత్సాహంతో అఖిల్ త‌దుప‌రి సినిమా ‘ఏజెంట్‌’ షూటింగ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఇది ప‌క్కా యాక్ష‌న్ మూవీ. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ ఎప్పుడో చెప్పేశారు. కెరీర్ ప్రారంభంలోనే అఖిల్ చేస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు స్టైలిష్ డైరెక్ట‌ర్‌గా పేరున్న సురేంద‌ర్ రెడ్డి. దానికి త‌గ్గ‌ట్లు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాడు. తాజా స‌మాచారం మేర‌కు అఖిల్ అక్కినేని ‘ఏజెంట్‌’ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టిని ద‌ర్శ‌క నిర్మాత‌లు సంప్ర‌దించార‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏంటో తెలుసా? విల‌న్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇక్క‌డొక విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. అదేంటంటే, గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘జ‌ల్సా’ సినిమాలో విల‌న్‌గా న‌టించాల‌ని మ‌మ్ముట్టిని అర‌వింద్ రిక్వెస్ట్ చేస్తే ఆయ‌న ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అఖిల్ సినిమాలో మాత్రం చేయ‌డానికి ఒప్పుకున్నారా? అనేది అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌ మేరకు ఏజెంట్ సినిమా కోసం పది రోజుల డేట్స్‌ను కేటాయించారట. అలాగే ఆయన పాత్ర చిత్రీకరణంతా యూరోప్‌లోనే ఉంటుందని, అందుకోసం ఆయన త్వరలోనే యూరప్ వెళ్లబోతున్నారట. మరి ఈ వార్తలపై ఆయ‌నేమైనా వివ‌రణిస్తాడేమో చూడాలి. అక్కినేని అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమాను సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ స‌రికొత్త లుక్‌తో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఆ లుక్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం రివీల్ అయ్యింది. అలాగే ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. మ‌రి ఏజెంట్‌తో అఖిల్ మ‌రో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C1qTKC
v

No comments:

Post a Comment