Tuesday, 5 October 2021

సంవత్సరాల తరబడి డేటింగ్.. ఇవీ మా లవ్ సీక్రెట్స్! తొలిసారి ఆ రహస్యాలు బయటపెట్టిన నమ్రత

టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు- జోడీ గురించి మనందరికీ తెలుసు. హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ నడిపించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎలాంటి మనస్పర్థలకు తావివ్వకుండా వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీ కపుల్ హోదాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే గాక సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో మోస్ట్ క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ కిక్కివ్వడం ఈ జోడీ హ్యాబీ. ఈ క్రమంలోనే తాజాగా తొలిసారి తమ ప్రేమ సంగతులపై ఓపెన్ అయ్యారు ఈ క్రేజీ కపుల్. 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాతో మొదటిసారి కలుసుకున్న మహేష్- నమ్రత.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు లవ్ ట్రాక్ నడిపించి చివరకు పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2005 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి మోస్ట్ క్రేజీ కపుల్‌గా కలర్‌ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 21 ఏళ్ల బంధంలో ఎన్నో అపురూమైన జ్ఞాపకాలు ఏర్పర్చుకున్న ఈ జోడీకి ఇద్దరు పిల్లలు (గౌతమ్, సితార) ఉన్నారు. అయితే తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి తమ ప్రేమ బంధంపై రియాక్ట్ అయ్యారు మహేష్ బాబు- నమ్రత జోడీ. తాము 'వంశీ' సినిమా సమయంలోనే ఒకరినొకరం ఇష్టపడ్డామని, అయిదు సంవత్సరాల పాటు డేట్‌లో ఉన్నామని అన్నారు. రెండేళ్ల తర్వాత తమ ప్రేమ బంధాన్ని సీరియస్‌గా తీసుకొని పెళ్లికి రెడీ అయ్యామని తెలిపారు. మొదటిసారి మహేష్‌ని చూసినప్పుడే ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని, ఓ ఇన్నోసెంట్ అనిపించిందని, అయన ఇచ్చిన మర్యాదకు ఫిదా అయ్యానని నమ్రత చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక మూడేళ్లకు ఈ జంట ఒక్కటయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన నమ్రత.. మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాల్లో కీలక భాగస్వామిగా ఉంటోంది. ఈ క్రేజీ జోడీని, వారి వారి అలవాట్లను చూసి మురిసిపోతుంటుంది టాలీవుడ్ లోకం. ఇకపోతే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Db8Bqt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...