Saturday, 2 October 2021

వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు.. స్కూల్లో ఉన్నప్పుడు ఓ అబ్బాయితో! గుట్టువిప్పిన సోనాక్షి సిన్హా

ఉన్నది ఉన్నట్లుగా, మనసులో ఏదీ దాచుకుందా నిర్మొహమాటంగా మాట్లాడటం కొందరి నైజం. అది ఎంతటి పర్సనల్ విషయమైనా సమయమొచ్చినప్పుడు కుండబద్దలు కొట్టేస్తుంటారు. ఈ కోవలోకే చెందిన వ్యక్తి బాలీవుడ్ హీరోయిన్ . విషయం ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన రిలేషన్ షిప్‌, లవ్ ఎఫైర్స్‌పై ఓపెన్ అయింది. తన స్కూల్ ఏజ్ నాటి సీక్రెట్ మొదలుకొని యంగ్ ఏజ్ రిలేషన్ వరకు అన్నీ బయటపెట్టేసింది. మీరెప్పుడైనా ఎవ్వరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్నపై రియాక్ట్ అవుతూ లైఫ్ సీక్రెట్స్ బయటపెట్టింది సోనాక్షి. స్కూల్లో ఉన్నప్పుడే ఒక అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని, అయితే అది కొద్ది రోజులకే ఎండ్‌ అయ్యిందని చెప్పిన ఆమె.. తాను 21, 22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించానని తెలిపింది. ఆ వ్యక్తితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్నానని, వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయని చెప్పింది. ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని, మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలని సోనాక్షి చెప్పుకొచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయనే సోనాక్షి సిన్హా. 2010లో 'దబాంగ్' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో వరుస అవకాశాలు పట్టేసింది. రీసెంట్‌గా ఆమె 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WzLTsy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...