Wednesday, 27 October 2021

దగ్గరుండి మరీ చేయించుకుంటోన్న బుట్టబొమ్మ.. త్వరలోనే పూజా హెగ్డే నుంచి గుడ్ న్యూస్

టాలీవుడ్ బుట్టబొమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఇక పూజా హెగ్డేను కూడా సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిథిగా పిలిచారంటే ఆమె స్టేటస్ ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. కోలీవుడ్‌లో అయితే ఏకంగా దళపతి విజయ్‌తో నటించేస్తోంది. టాలీవుడ్ విషయానికి వస్తే ఈ మధ్యే పూజా హెగ్డే ఖాతాలో మంచి హిట్ పడింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా హిట్ అవ్వడంతో పూజా హెగ్డే పేరు మరోసారి సాలిడ్‌గా వినిపిస్తోంది. అయితే పూజా హెగ్డే వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్లను కొట్టేసింది. అలా టాలీవుడ్‌లో పూజా హెగ్డే రేర్ ఫీట్‌ను సాధించింది. అలా టాలీవుడ్‌లో పూజా హెగ్డేకు గట్టిగానే రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు పూజా హెగ్డేకు ముడుతోందని టాక్. ఇక ఈ రేంజ్‌లో సంపాదిస్తోంది కనుకే బుట్టబొమ్మ అదిరిపోయే ఇళ్లు కడుతోందట. ఆ ఇళ్లు ఇపుడు నిర్మాణంలోనే ఉంది. అందుకే అన్నీ విషయాలను దగ్గరుండి మరీ చూసుకుంటోందట. ఇంటికి సంబంధించిన వాటిలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందట. ఈ మేరకు పూజా హెగ్డే తన కొత్తింటి విశేషాలను చెప్పుకొచ్చింది. ఇంకా నిర్మాణంలోనే ఆ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక పూజా హెగ్డే , రాధేశ్యామ్ సినిమాలతో పలకరించబోతోంది. దీపావళికి పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన టీజర్ లాంటిది రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆచార్య నుంచి దీపావళికి పూజా హెగ్డే మీద ఏదైనా స్పెషల్ పోస్టర్ వస్తుందేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bhUeEU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...