Thursday, 21 October 2021

నాగ చైతన్య న్యూ స్టెప్.. ఆమెకు ఓకే చెప్పేసిన అక్కినేని యువ హీరో!

నాగార్జున తనయులు, అక్కినేని వారసులు యమ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా చెరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో అఖిల్ ఖాతాలో హిట్ పడగా, బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ సినిమాతో విజయం సాధించారు. సమంతతో విడాకుల ప్రకటన అనంతరం చైతూ అందుకున్న ఈ విక్టరీ అక్కినేని అభిమానులను ఖుషీ చేసింది. అయితే అదే జోష్‌లో తాజాగా నాగ చైతన్య మరో న్యూ స్టెప్ వేశారని తెలిసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' మూవీ చేస్తున్నారు నాగ చైతన్య. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు'లో తన పోర్షన్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా లోనూ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండగానే తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డితో మరో సినిమాకు కమిట్ అయ్యారట చైతూ. ఇటీవలే చైతూకు ఆమె ఓ కథ వినిపించిందని, అది ఆయనకి నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. సీనియర్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా, చైతూతో చేయనున్న ఈ కథ, గతంలో విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసి పెట్టిన కథ అనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సంతోష్ శోభన్‌తో ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమా చేస్తోంది నందినీ రెడ్డి. ఈ సినిమా పూర్తి కాగానే చైతూ ప్రాజెక్టును పట్టాలెక్కించనుందని చెబుతున్నారు. ఈ లోగా చైతూ కూడా తన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి నందినీకి ఫుల్ డేట్స్ ఇవ్వనున్నారని అంటున్నారు. సో.. చూడాలి మరి ఈ ప్రాజెక్టు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GlaRhB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...